Mother Deer Sacrifice : బిడ్డ కోసం తల్లి జింక ప్రాణత్యాగం.. ఎమోషనల్ చేస్తున్న వీడియో !

Mother Deer Sacrifice :  తల్లి ప్రేమ.. ఇది మనుషులకే కాదు.. జంతువులకు, పక్షులకూ ఉంటుంది.. తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవడం కన్నవారి నైజం.. ఇదే నిజం!! 

Published By: HashtagU Telugu Desk
Mother Deer sacrifice

Mother Deer sacrifice

Mother Deer Sacrifice :  తల్లి ప్రేమ.. ఇది మనుషులకే కాదు.. జంతువులకు, పక్షులకూ ఉంటుంది.. తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవడం కన్నవారి నైజం.. ఇదే నిజం!!  తాజాగా ఒక తల్లి జింక కూడా తన పిల్ల జింకపై ప్రేమను చాటుకుంది.. నదిలో మొసలికి ఆహారంగా మారబోతున్న పిల్ల జింకను కాపాడేందుకు .. తన ప్రాణాలను పణంగా పెట్టింది.. ఇంకొన్ని సెకన్లు అయితే.. తన  పిల్ల జింకను మొసలి నోటిలో కరుస్తుందన్న సమయంలో వేగంగా పరుగెత్తుతూ వచ్చింది. పరుగుపరుగున వచ్చి.. తన బిడ్డ వైపుగా వెళ్తున్న మొసలికి ఎదురుగా నిలబడింది.. దీంతో వెంటనే మొసలి తన స్వభావానికి తగ్గట్టుగా ఆ తల్లి జింకను నోటిలో కరిచి(Mother Deer Sacrifice)  తినేసింది.

Also read : Rains From August 20 : తెలంగాణలో వానలు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే ?

ఈ  హృదయ విదారక వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.  తల్లిప్రేమ విలువను మానవాళికి మరోసారి గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. పిల్లల కోసం పేరెంట్స్ పడే తాపత్రయాన్ని అద్దంపట్టేలా ఇందులో మహత్తర సందేశం ఉంది. నోరు లేని జంతువుల నుంచి కూడా మంచి విషయాలను నేర్చుకునేందుకు మనం ఒక మెట్టు దిగితే తప్పేం లేదు అని నెటిజన్స్ అంటున్నారు. ఈ వైరల్ వీడియోను చూసి చాలామంది నెటిజన్స్ ఎమోషనల్ అయ్యారు. రకరకాల కామెంట్స్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 10 రోజుల్లోనే 2.71 లక్ష లైక్స్ రావడం విశేషం.

Also read : Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు

  Last Updated: 14 Aug 2023, 11:41 AM IST