Site icon HashtagU Telugu

SMALL EMPLOYEE BIG SCAM : మంత్లీ శాలరీ 30వేలు.. ఇంట్లో 30 లక్షల టీవీ .. కోట్లు ఎక్కడివంటే ?

Small Employee Big Scam

Small Employee Big Scam

ఆమె పేరు హేమ మీనా. హౌసింగ్ కార్పొరేషన్‌ లో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగి (SMALL EMPLOYEE BIG SCAM). జీతం అక్షరాలా రూ.30 వేలు మాత్రమే. కానీ ఇంట్లో రూ.30 లక్షలు విలువైన టీవీ ఉంది. కోట్ల విలువైన బంగళా, లక్షలు విలువైన వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు ..70 ఆవులు, 50 అన్యదేశ కుక్కలు, 10 కార్లు, కొన్ని ట్రక్కులు, ట్యాంకర్లు కూడా ఆమె పేరిట ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని హౌసింగ్ కార్పొరేషన్‌ లో ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హేమ అవినీతి (SMALL EMPLOYEE BIG SCAM)పై ఆ రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మే 11న (గురువారం) తెల్లవారుజామున భోపాల్, రైసెన్, విదిశాలోని హేమ నివాసాలు, కుటుంబ సభ్యుల ఇళ్లపై రైడ్స్ చేసిన లోకాయుక్త టీమ్ కు దిమ్మ తిరిగింది. లంచాలు తీసుకొని ఆమె కూడబెట్టిన ఆస్తులను చూసి రైడ్ చేసిన అధికారులు నోరెళ్లబెట్టారు. కొన్ని గంటల్లోనే ఇంజనీర్ హేమ మీనాకు చెందిన సుమారు ఏడు కోట్ల ఆస్తి దొరికింది. దీంతో ఆమెకు ప్రతినెలా రూ. 30 వేల జీతాన్ని మించిన స్థాయిలో లంచాలు వచ్చాయని బట్టబయలైంది. హేమ మీనా కొనుగోలు చేసిన ఆస్తుల ఖరీదు.. ఆమెకు జాబ్ ద్వారా వచ్చే చట్టపరమైన ఆదాయం కంటే 232% ఎక్కువగా ఉందని లోకాయుక్త పేర్కొంది. మీనాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు (SMALL EMPLOYEE BIG SCAM) నమోదు చేసింది. ఇంకా దాడులు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు.

also read : AP Scam : రూ. 20వేల కోట్ల ‘లేపాక్షి’ని లేపేస్తున్నారోచ్!?

70 రకాల ఆవులు.. 50 విదేశీ జాతి కుక్కలు.. 10 ఖరీదైన వాహనాలు

లోకాయుక్త బృందానికి నాయకత్వం వహిస్తున్న డీఎస్పీ సంజయ్ శుక్లా మాట్లాడుతూ.. ” హేమ మీనా తన తండ్రి పేరు మీద భోపాల్‌లోని బిల్ఖిరియా గ్రామంలో 20,000 చదరపు అడుగుల భూమిని కొన్నది. దాదాపు కోటి రూపాయలు వెచ్చించి మరో బంగ్లాను నిర్మించింది. భోపాల్‌, రైసెన్‌, విదిషాలోని పలు గ్రామాల్లో వ్యవసాయ భూమిని కూడా హేమ కొనుగోలు చేసింది. హార్వెస్టర్, వరి నాట్లు యంత్రం, ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలను కూడా హేమ మీనా కొనుగోలు చేసింది. బిల్ఖిరియాలోని ఉన్న హేమ ఇంట్లో 98 అంగుళాల సైజు ఉన్న రూ.30 లక్షల విలువైన టీవీని గుర్తించాం. పిట్ బుల్, డోబర్ మాన్ జాతి కుక్కలు సహా దాదాపు 50 విదేశీ జాతి కుక్కలు దొరికాయి. హేమ డెయిరీలో దాదాపు 60 నుంచి 70 రకాల ఆవులు ఉన్నాయి. ఫామ్‌హౌస్‌లో ఒక ప్రత్యేక గది కూడా ఉంది. అందులో ఖరీదైన మద్యం, సిగరెట్లు ఉన్నాయి. హేమ బంగ్లా నుంచి 2 ట్రక్కులు, 1 ట్యాంకర్, థార్ సహా 10 ఖరీదైన వాహనాలను స్వాధీనం చేసుకున్నాం” అని వివరించారు.

Exit mobile version