Site icon HashtagU Telugu

Monkey Cheers Beer: బీర్ తాగిన కోతి.. వీడియో వైరల్!

Monkey

Monkey

మనుషులకు, కోతులకు చాలా దగ్గర పోలికలు ఉంటాయంటారు చాలామంది. అందుకేనేమో ఓ కోతి మనుషులకు ‘‘మేమేం తక్కువ’’ అనుకున్నట్టు ఉంది. ఏకంగా బీర్ బాటిల్ ను చేత పట్టుకొని గటగట తాగేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో మద్యపానాన్ని తాగుతోంది ఓ కోతి. బీర్ తాగిన కోతి చాలా ప్రమాదకరంగా ప్రవర్తించిందట.

కోతి మద్యానికి అలవాటు పడి మద్యం షాపుల్లోకి చొరబడి బీర్ బాటిల్ తో పారిపోయినట్లు సమాచారం. చాలాసార్లు మందు షాపుల నుంచి కొనుగోలు చేసే వారి నుంచి మద్యం బాటిళ్లను కూడా కోతి లాక్కుంది. లాక్కున్న బాటిల్స్ ఓ ప్రాంతానికి తీసుకెళ్లి తాగేస్తోంది. అటవీ శాఖ సహకారంతో ఈ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.