Baby Elephant : త‌ల్లి ఏనుగు త‌న పిల్ల‌ని వ‌ర్షంలో త‌డ‌వ‌కుండా ఎలా కాపాడుతుందో చూడండి..!

చిన్న పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌, ధైర్యం అంతా త‌ల్లే.. త‌ల్లిలాగా బిడ్డ‌ను ఎవ‌రూ ర‌క్షించ‌లేరు. త‌న క‌న్న‌పిల్ల‌ల కోసం ప్రాణాల‌ర్పించేందుకు కూడా తల్లి సిద్ద‌మ‌వుతుంది.

Published By: HashtagU Telugu Desk
Elephant

Elephant

చిన్న పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌, ధైర్యం అంతా త‌ల్లే.. త‌ల్లిలాగా బిడ్డ‌ను ఎవ‌రూ ర‌క్షించ‌లేరు. త‌న క‌న్న‌పిల్ల‌ల కోసం ప్రాణాల‌ర్పించేందుకు కూడా తల్లి సిద్ద‌మ‌వుతుంది. అది మ‌నుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఉంటుంద‌ని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఒక తల్లి ఏనుగు వర్షం నుండి తన పిల్ల ఏనుగుని రక్షించే వైరల్ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని గూడలూర్ మునిసిపాలిటీలో ఈ వీడియో చిత్రిక‌రించారు. ఈ త‌ల్లి ఏనుగు కవచంగా పనిచేసి, వర్షంలో తడవకుండా త‌న పిల్లను కాపాడుతున్నట్లు క‌నిపిస్తుంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ వీడియోని షేర్ చేస్తూ, తల్లి ఏనుగు తన పిల్ల‌ను వ‌ర్షం నుంచి రంక్షించేందుకు త‌న పొట్ట‌నే పెద్ద గొడుగా ఉంచి కాపాడుకుంద‌ని ఆమె రాశారు. షేర్ చేసిన ఈ వీడియో వేల సంఖ్య‌లో వీక్షించారు.

  Last Updated: 11 Jul 2022, 10:59 PM IST