Mohammed Siraj Dating: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj Dating) రెస్ట్ మోడ్ లోకి వెళ్లపోయాడు. ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లో పాల్గొనడం లేదు. ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ ట్రోఫీకి కూడా సిరాజ్ ను జట్టులోకి తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటినప్పటికీ సిరాజ్ ను సెలెక్ట్ చేయకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సిరాజ్ కు విశ్రాంతి ఇవ్వడం కోసమే అతనిని పక్కనపెట్టామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ గ్యాప్ లో సిరాజ్ మియాపై డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ సింగర్ జానైతో ఆయన ఫోటో వైరల్ అయినప్పటి నుండి ఆయన ప్రేమ వ్యవహారం గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల జనై 23వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సిరాజ్ తో పాటు శ్రేయస్ అయ్యర్, నటుడు జాకీ ష్రాఫ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ సహా తదితురులు పాల్గొని సందడి చేశారు. అయితే వీరిలో సిరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. జనైతో దిగిన పిక్ వైరల్ గా మారింది. ఇందులో వీరిద్దరు సన్నిహితంగా కనిపించారు. దీంతో ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఈ పుకార్లన్నింటికీ సిరాజ్ మియా ఫుల్ స్టాప్ పెట్టాడు.
Also Read: Bandi Sanjay On Gaddar : బరాబర్ గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం – బండి సంజయ్
జానైతో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ అబ్బే అలాంటిది ఏమీ లేదని అన్నాడు. ఆమె తన చెల్లెలు లాంటిదని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే జనై కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సిరాజ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ బ్రదర్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క క్యాప్షన్ తమపై వస్తున్న పుకార్లకు తెరదించింది. సింగర్ జనై భోస్లే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.