Site icon HashtagU Telugu

Modi Panauti: రాహుల్ కు ఈసీ షాక్.. నోటీసులు జారీ

Modi Panauti

Modi Panauti

Modi Panauti: ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే దిశగా ఎన్నికల ప్రచారం చేస్తుంది. అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. కర్ణాటక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ తెలంగాణలోను జెండా ఎగురవేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తెలంగాణను పలుమార్లు సందర్శించి బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఈడీ , ఈసీ నోటీసులు తలనొప్పిగా మారాయి.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రాహుల్ ఉల్లంఘించారని ఈసీ నోటీసులో పేర్కొంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై రాహుల్ .. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రపంచకప్ వైఫల్యానికి మోదీయే కారణమని కామెంట్స్ చేశాడు. భారత జట్టు బాగా ఆడి ప్రపంచకప్ గెలిచింది.. కానీ చెడు శకునం కారణంగా మ్యాచ్ ఓడిపోయిందని మోదీపై కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Gifts : అలాంటి వస్తువులు బహుమతిగా ఇస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?