Vanajeevi Ramaiah’s Death : ‘వనజీవి’ కోసం తెలుగులో ప్రధాని ట్వీట్

Vanajeevi Ramaiah’s Death : వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటి వాటిని రక్షించడంలో అవిశ్రాంత కృషి చేశారు. ఆయన జీవితం ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తుంది

Published By: HashtagU Telugu Desk
Vanajeevi Ramaiah Death Mod

Vanajeevi Ramaiah Death Mod

ప్రకృతి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య మరణం (Vanajeevi Ramaiah’s Death ) పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. మొక్కలు నాటి వాటిని పరిరక్షించే ఉద్యమానికి జీవితాన్ని అర్పించిన రామయ్య, లక్షలాది వృక్షార్పణల ద్వారా అనేకరూపాలలో పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతాపాన్ని తెలుగులో వ్యక్తపరిచారు. ఇది ప్రత్యేకంగా ప్రజల గుండెల్లో తాకేలా ఉంది.

PM మోదీ ట్వీట్‌లో “వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటి వాటిని రక్షించడంలో అవిశ్రాంత కృషి చేశారు. ఆయన జీవితం ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఆయన పని మన యువతలో హరితభూమిని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి తెలుగులో ట్వీట్ చేయడం రామయ్యకు ఇచ్చిన గౌరవాన్ని మరింతగా చాటిచెప్పింది.

Prithvi Shaw: గైక్వాడ్ స్థానంలో చెన్నై జట్టులో చేర‌నున్న పృథ్వీ షా?

వనజీవి రామయ్య యొక్క జీవితయానం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. పర్యావరణాన్ని ప్రేమించాలనే సందేశాన్ని గ్రామాలు, పట్టణాల దాకా తీసుకెళ్లిన ఆయన సేవలు అపారమైనవిగా భావించవచ్చు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో తన జీవితంలో చూపించారు. ఈ సందర్బంగా రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఆయన చిన్ననాటి నుంచే మొక్కలపై ప్రేమను పెంచుకున్నారు. 50 ఏళ్ల పాటు విత్తనాలు చల్లి, కోటి మొక్కలు నాటి, ప్రకృతి పరిరక్షణలో స్ఫూర్తిదాయక మార్గదర్శకుడిగా నిలిచారు. 2018లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో రామయ్య సేవలను గౌరవించింది. మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యాంశాల్లో ఆయన జీవితం చేర్చగా, తెలంగాణలో కూడా పిల్లలకు రామయ్య కథను బోధిస్తున్నారు. రామయ్య మృతి ప్రకృతి ప్రేమికుల మనసుల్లో తీరని శూన్యతను కలిగించింది. ఆయన సేవలను గుర్తిస్తూ ప్రజలు భారీగా రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.

  Last Updated: 12 Apr 2025, 02:40 PM IST