Kavitha: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand) ఈరోజుతో ముగియనుంది. దీంతో కవితను నేడు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కూడా ఈరోజుతో రిమాండ్ ముగుస్తుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు తిరస్కరించబడింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈసారి కూడా కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తారా? లేక బెయిల్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఈరోజు కోర్టు పరిశీలించనుంది. ఆ తర్వాత కవితతోపాటు ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీని అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కవితను నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది.
Read Also: Haldiram: రూ. 70 వేల కోట్ల ఆఫర్.. నో చెప్పిన హల్దీరామ్ కంపెనీ..!
మరోవైపు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీశ్ సిసోడియా మాత్రం జైల్లోనే ఉన్నారు.