Site icon HashtagU Telugu

Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌..సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Allegations Against Kavitha

Kavitha's petition in court on CBI arrest

Delhi High Court notices to CBI: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత(Kavitha) బెయిల్‌ పిటిషన్‌(Bail Petition)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు సీబీఐకీ నోటీసులు(Notices to CBI) జారీ చేసింది. అవినీతి కేసులో తనను సీబీఐ అరెస్టు చేసి రిమాండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ..కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సీబీఐ సమాధానం కోసం జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసంన పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణను మే 24కు వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌తో పాటు మే 24న తదుపరి విచారణ చేపట్టనున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండూ విచారిస్తున్న కేసుల్లో తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను మే 6న న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. గత వారం, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కవిత, ఇతరులను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఢిల్లీ కోర్టు ముందు తన ఏడవ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

Read Also: Hyderabad : పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్‌ ఇంటి‌పై దాడి..

కాగా, కవిత జ్యుడీషయల్‌ కస్టడిని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల20 వరకు ఈడీ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ ఎవెన్యూకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఈడీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో.. కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా.. ఇక్కడ కూడా కవితకు నిరాశే ఎదురవటం గమనార్హం. ఇదే సమయంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 11న కవితను మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది.