Site icon HashtagU Telugu

Kavitha : ఎమ్మెల్సీ కవిత రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగింపు

MLC Kavitha remand extended for another 14 days

Kavitha : ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ పొడిగించింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, కాబ్టటి కవిత రిమాండ్‌ను  పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో భాగంగా కవితనే కీలక సూత్రధారి అని ఆరోపించిన సీబీఐ.. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం లాంటి పనులు చేసిందని తెలిపింది. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని.. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండడం పట్ల ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో నేడు లిక్కర్ కేసు విచారణ జరిగింది.

Read Also: Janhvi Kapoor : దేవర షూటింగ్‌లో జాన్వీ కోసం ఎన్టీఆర్ ఫుడ్ ఫీస్ట్.. పిక్ వైరల్..