MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు..విచారణ వాయిదా

MLC Kavitha : ఇక,  తదుపరి విచారణ అక్టోబర్ 19 వరకు కోర్టు వాయిదా పడింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి తదితర నేతలకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేసింది.

Published By: HashtagU Telugu Desk
MLC Kavitha Liquor case..Inquiry adjourned

MLC Kavitha Liquor case..Inquiry adjourned

Delhi Liquor Case : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై శుక్రవారం ఢిల్లీ రౌస్ ఆఫ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్, విజయ్ నాయర్ వర్చ్ వల్ గా విచారణకు హాజరయ్యారు.

Read Also: YS Jagan: ల‌డ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇక,  తదుపరి విచారణ అక్టోబర్ 19 వరకు కోర్టు వాయిదా పడింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి తదితర నేతలకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి. కాగా, గత విచారణలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్ళీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు.

Read Also:Balka Suman: ఐపీఎస్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌

  Last Updated: 04 Oct 2024, 04:57 PM IST