Kavitha : హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్‌ పటిషన్‌

  • Written By:
  • Publish Date - May 16, 2024 / 12:45 PM IST

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి బెయిల్‌ పిటిషన్‌(Bail Petition)ను దాఖలు చేశారు. కవితన బెయిల్‌ పటిషన్‌ను ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయమున్న ఆరోపిస్తూ.. ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో కవిత బెయిల్‌ కోసం విశ్వ ప్రయత్నా చేస్తున్నారు.

Read Also: Phase 5 Polling : మే 20న ఐదో విడత పోలింగ్.. కీలక అభ్యర్థులు, స్థానాలివే

మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటివల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కవితకు కూడా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ వస్తుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.