MLA Raja Singh Fires On KTR: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవీ లేక కేటీఆర్ కు పిచ్చి పట్టిందని అన్నారు. కేటీఆర్ కి పిచ్చేకి.. అమిత్ షా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం హింది మాత్రమే నేర్చుకోవాలని చెప్పారని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయి ఖాళీగా ఉన్నారని, అందుకే ప్రసారమాధ్యమాల్లో ఉండాలనే ఆలోచనతో అమిత్ షాను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అగ్రశ్రేణి బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి
పక్క రాష్ట్రానికి వెళ్తే అందరూ ఏ భాష మాట్లాడుతారు..? మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో ఏ భాషలొ మాట్లాడారని నిలదీశారు. ఇదిలా ఉండగా.. ఇంగ్లీషు భాషకి తాను వ్యతిరేకిని ఏం కాదని.. ప్రతీ విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని అమిత్ షా సూచించారు. ఇది దేశీయ భాషల పరిరక్షనకు చాలా అవసరమన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవ కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. భారతదేశ గొప్పతనం ఈ భాష వైవిద్యం లో ఉందని.. ఇది దేశ గొప్పదనమన్నారు. కేటీఆర్ బాషోన్మాదానికి పాల్పడితే దేశానికే ముప్పు అని రాజాసింగ్ హెచ్చరించారు. హిందీ భాష నేర్చుకుంటే యావత్ దేశంలో ఎక్కడికి వెళ్లినా హిందీలో మాట్లాడవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చన్నది అమిత్ షా ఉద్దేశం అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
Read Also: CP CV Anand : గణేష్ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు : సీపీ ఆనంద్