Site icon HashtagU Telugu

Miss Lesbian Wedding: పెళ్లి చేసుకున్న అందాల ‘లెస్బియన్’ భామలు.. వీడియో వైరల్!

Miss Lesbians

Miss Lesbians

పెళ్లి అనగానే చాలామందికి చుక్కలాంటి అమ్మాయి, చక్కనైనా అబ్బాయి (చూడముచ్చట జంట) గుర్తుకువస్తారు. కాలం మారుతుండటంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఆలోచనలు మారుతున్నాయి. గే మ్యారేజ్ తో పాటు లెస్బియన్ మార్యేజ్ లు పుట్టుకువచ్చాయి. తాజాగా మరో లెస్బియన్ జంట పెళ్లి చేసుకొని సంచలనం కలిగించింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో 2020లో ఒకరినొకరు కలుసుకున్న మిస్ అర్జెంటీనా మరియానా వరెలా, మిస్ ప్యూర్టో రికో ఫాబియోలా ఓ రహస్య వేడుకలో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు.

పోటీలో అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు అందాల రాణులు. అక్టోబర్ 28న పెళ్లి చేసుకున్నట్లు ఇద్దరు తెలిపారు. ఒక ప్రత్యేక రోజు. 28/10/22” అని వారు క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ జంట షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1 లక్షకు పైగా లైక్స్, 2 మిలియన్లకు వ్యూస్ దక్కాయి. గతంలో ముద్దులాడిన, జలకాలాడిన, వివిధ ప్రదేశాలను చుట్టేసిన వీడియోను షేర్ చేశారు. ప్రపోజల్ వీడియోను పంచుకున్నారు. గదిని బెలూన్స్, లైట్లతో అందంగా అలంకరించారు. తమ ఎంగేజ్‌మెంట్ ఉంగరాలను చూపుతూ ప్రేమను వ్యక్తం చేశారు.

Exit mobile version