Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

భారతదేశంలో ఎన్నో రకాల ఫేమస్ ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రదేశాలలో బట్టలు ఫేమస్ కాగా మరికొన్ని

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 08:45 AM IST

భారతదేశంలో ఎన్నో రకాల ఫేమస్ ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రదేశాలలో బట్టలు ఫేమస్ కాగా మరికొన్ని ప్రదేశాలలో తినుబండారాలు, మరికొన్ని ప్రదేశాలలో ఆలయాలు ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అయితే చాలా వరకు ఎక్కువగా స్వీట్లు, లేదంటే ఏదైనా తినే పదార్థాల కారణంగా కొన్ని రకాల ప్లేసులు తెగ ఫేమస్ అవుతూ ఉంటాయి. ఇక చాలామంది ఆ యొక్క దేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ తినే పదార్థాలను టేస్ట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్వీట్ కూడా అలాంటిదే చెప్పవచ్చు. రాజస్థాన్ లోని జోద్ పూర్ లో స్టాంప్‌డ్ పెడాస్ ఎక్కడ దొరుకుతాయి అని ఎవరిని అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తూ ఉంటారు..

ఘంటాఘర్ చౌక్‌ దగ్గర ప్రతిరోజూ దూరప్రాంతాల నుండి సైతం మిశ్రీలాల్ దుకాణానికి వచ్చి స్టాంప్‌డ్ పెడాస్ ను కొనుగోలు చేస్తుంటారు. కుంకుమ పువ్వుతో తయారు చేసిన ఈ బంగారు రంగు స్టాంప్డ్ పెడాస్ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తినడానికి ఎంత రుచిగా అయితే ఉంటాయో చూడడానికి కూడా అంతే అందంగా కనిపిస్తాయి. అయితే ఈ స్టాంపింగ్ పెడాస్‌కు ఒక ఘనమైన చరిత్ర కూడా ఉంది. స్టాంప్‌డ్ పెడాస్ ఈ దుకాణం 1927లో ప్రారంభం అయ్యింది. ఈ దుకాణాన్ని తన తాత మిశ్రీలాల్ ప్రారంభించారని మూడవ తరానికి చెందిన సందీప్ అరోరా చెప్పారు.1927లో మిశ్రిలాల్ అరోరా ఈ దుకాణంలో నెయ్యి కచోరీ, రబ్రీ, కోఫ్తా విక్రయించేవారు.

వీటితోపాటు ఇంగ్లండ్ నుండి అనేక రుచుల సోడాలను తీసుకువచ్చి విక్రయించడం ప్రారంభించాడు. 1960లో మఖానియా, లస్సీ విక్రయాలు ప్రారంభించాడు. 1975లో దాదా మిస్రీలాల్‌కు పెడాస్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని సందీప్ తెలిపారు. ఎన్నో ప్రయోగాల తర్వాత మావాకు కుంకుమపువ్వు జోడించి, బంగారు రంగు పెడాస్ తయారు చేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ నుంచి ప్రత్యేక స్టాంపును తయారు చేయించి వాటిపై మిశ్రిలాల్ పెడాస్ అని ముద్రింపజేశాడు. మారుతున్న ట్రెండ్‌లో భాగంగా షాప్‌కి ఆన్‌లైన్ ఆర్డర్లు కూడా రావడం మొదలయ్యాయి. విదేశీ పర్యాటకులు సైతం ఈ పెడాస్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. కేవలం పాలతో తయారు చేసిన ఈ స్టాంప్‌డ్ పెడాస్ ఉపవాస సమయంలో కూడా తినవచ్చని సందీప్ అరోరా తెలిపారు.