Site icon HashtagU Telugu

Amit Shah : అమిత్‌ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు

Amit Shah

Minor changes in Amit Shah's Telangana tour

Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న తెలంగాణ పర్యటన( Telangana Tour)  కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్‌ షా బాన్సువాడకు బదులు సిద్దిపేట(Siddipet)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మెదక్‌ బీజేపీ(bjp) అభ్యర్థి రఘునందనరావు(Raghunandana Rao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది కమలం పార్టీ. ఇందులో భాగంగానే.. ఈ నెల 25 తర్వాత తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు ఉన్నాయి.

Read Also: NTR : ఇవేమి మాస్ సెలబ్రేషన్స్‌రా బాబు.. నెల రోజులు ముందు నుంచే ఎన్టీఆర్ బర్త్ డే..

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కూడా ఏప్రిల్ 27న హైదరాబాద్‌(Hyderabad)కు రానున్నారు. ఆయన తన పర్యటనలో ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. హైటెక్ సిటీ నోవాటెల్‌లో ఐటీ నిపుణులతో మోడీ భేటీ కానున్నారు.

Read Also: TS Inter Results 2024: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?

ఈనేపథ్యలంలో మోడీ బీజేపీ కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ లోపే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.