Minister Ponnam Prabhakar : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Minister Ponnam Prabhakar : రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేదం లేదని.. దావత్ లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి నిబంధనలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Published By: HashtagU Telugu Desk
Minister Ponnam

Minister Ponnam

Janwada Farm House Party : మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పార్టీ జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడైనా వందల మంది వచ్చి మద్యం సేవించాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేదం లేదని.. దావత్ లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి నిబంధనలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తానికి జన్వాడ ఫామ్‌ హౌస్‌ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

కాగా, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై పొలిటికల్‌ ఫైట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఫామ్ హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అటు.. ఫ్యామిలీ పార్టీని రేవ్‌ పార్టీగా ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీపై బీఆర్ఎస్‌ భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే.. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు విషయంలో సోమవారం హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేశారు.

  Last Updated: 28 Oct 2024, 04:25 PM IST