New Ration Cards : నూతన రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 04:09 PM IST

New Ration Cards: మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కరీంనగర్‌(Karimnagar)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నూతన రేషన్ కార్డు(New Ration Cards)లపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి, కరీంనగర్‌కు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సిద్ధమని.. బండి సంజయ్, బోయినపల్లి వినోద్ కుమార్ సిద్ధమా? అని సవాల్ చేశారు. అతి త్వరలో నూతన రేషన్ కార్డులు రాబోతున్నాయని శుభవార్త చెప్పారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు.. వచ్చే ఆగష్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

వచ్చే వానాకాలం పంటకు రూ.500 బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అక్కసుతో ప్రభుత్వంపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు. తల్లిని రాజకీయాల్లోకి లాగిన వ్యక్తి బండి సంజయ్ అని అన్నారు. తల్లి పేరుమీద రాజకీయాలు చేసేది ఏవరో అందరికీ తెలుసని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్నేహితులు అని అన్నారు. వినోద్ కుమార్‌ను ఓడించడానికి గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. పేద ప్రజల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

Read Also: AP Eelctions 2024: 6 స్థానాల్లో పోలింగ్ సమయం మార్పు.. ఎందుకంటే?