Rs 75 Lakhs Lottery : పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు అశోక్‌కు కేరళలో లాటరీ తగిలింది. దీంతో ఏకంగా రూ.75 లక్షలు వచ్చాయి. అయితే ఆ లాటరీ టికెట్‌ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. లాటరీ టికెట్‌ను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు పోలీసులను సెక్యూరిటీ అడిగాడు. అతడి భయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు .. సెక్యూరిటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అశోక్ కొన్ని నెలల కిందట కేరళకు వెళ్లాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్ని నెలల కిందట కేరళ ప్రభుత్వానికి చెందిన విన్-విన్ లాటరీ టికెట్ కొన్నాడు. మొదటి బహుమతిగా రూ.75 లక్షలు(Rs 75 Lakhs Lottery) అతడికి దక్కాయి.
We’re now on WhatsApp. Click to Join.
అశోక్ లాటరీ టికెట్ గెల్చుకున్నాక.. దాన్ని ఎవరైనా చోరీ చేస్తారేమోనని, లాక్కుంటారేమోనన్న భయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు మలయాళీ మిత్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు అశోక్ వెళ్లాడు. తన పరిస్థితిని పోలీసులకు వివరించాడు. మరోవైపు అశోక్ ఆందోళన అర్థం చేసుకున్న పోలీస్ అధికారి సానుకూలంగా స్పందించారు. గెలిచిన లాటరీ టికెట్‌ను బ్యాంకులో సురక్షితంగా సమర్పించేందుకు సీనియర్ సీపీఓతో సహా పోలీసు సిబ్బందిని అశోక్ వెంట పంపారు. దీంతో పోలీసు రక్షణతో బ్యాంకుకు వెళ్లిన అతడు గెలిచిన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ గెలిచిన ఆనందం పొందాడు. ఇక బెంగాల్‌లోని తన స్వగ్రామానికి వెళ్లిపోయి.. అక్కడే ఉంటూ ఏదైనా స్వయం ఉపాధి పని చేసుకోవాలని అశోక్ నిర్ణయించుకున్నాడు.
Also Read: Congress Vs BJP : రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే ఎందుకు ప్రారంభిస్తున్నారు ? : కాంగ్రెస్
ఒక్కసారిగా ఏదైనా కలిసి వచ్చిందంటే.. లాటరీ తగిలిందని అంటుంటాం. మరి ఒక లాటరీ తగిలి మొత్తం జీవితం అసలే మాత్రం ఊహించనంతగా మారిపోతే.. ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా.. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఓ వ్యక్తికి లాటరీ(రూ.166)లో ఏకంగా 13,339 కోట్ల రూపాయల (160 కోట్ల డాలర్ల) ‘మెగా మిలియన్’ లాటరీ తగిలింది. నిజానికి సెప్టెంబర్ 27నే విజేత ఎవరో తేలిపోయినా.. భద్రతా నిబంధనల మేరకు మూడు నెలల తర్వాత తాజాగా పేరును ప్రకటించారు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ‘మెగా మిలియన్’ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతి మొత్తం కావడం గమనార్హం. ఇక లాటరీ టికెట్‌ను అమ్మిన జాక్సన్‌విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌కు రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) అదనపు కమీషన్‌గా లభించాయి.