Site icon HashtagU Telugu

Bill Gates Wife : రిపోర్ట‌ర్ తో బిల్ గేట్స్ భార్య డేటింగ్

Billgatest Wife

Billgatest Wife

ప్ర‌పంచ కుబేరుడు బిల్ గేట్స్ స‌తీమ‌ణి మిలిందా రిపోర్ట‌ర్ తో డేటింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఓ ఆన్ లైన్ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది. ఈ కథనాలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీ కానీ ఇంతవరకు స్పందించలేదు. 58 ఏళ్ల మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు మార్లు మీడియా కంటికి చిక్కారు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 1994లో వైవాహిక బంధంతో ఒకటైన వీళ్లు 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు ప‌లికారు. బిల్ గేట్స్ తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని మిలిందా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇటీవ‌ల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె మరోసారి ప్రేమలో పడినట్టు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు.