Site icon HashtagU Telugu

TS : ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్‌ సందేశం

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Telangana Lok Sabha elections: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) తన ఓటు హక్కును వినియోగించున్నారు. హైదరాబాద్‌ జూబ్లీక్లబ్‌లో చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటును యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

స్టేట్, సెంట్రల్‌లో సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.

Read Also: TDP Kidnapping: టీడీపీ పోలింగ్ ఏజెంట్ల కిడ్నప్.. చంద్రబాబు సీరియస్

మరోవైపు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే వెంకయ్యనాయుడు పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లితో కలిసి వెళ్లి ఓటు వేశారు. క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే తన ఓటు వేశారు. హైదరాబాద్ సిటీలో తనకు కేటాయించిన పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్‌లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు హక్కు వినియోగించుకున్నారు.