Costly CEO : ఏడాదికి రూ. 123 కోట్లు.. దేశంలోనే కాస్ట్లీ సీఈవో !!

రూ.123.13 కోట్ల వార్షిక వేతనం .. ఇంత పెద్ద ప్యాకేజీ అంటే మామూలా? ఇది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు గత ఏడాది ఇచ్చిన పేమెంట్.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 07:30 PM IST

రూ.123.13 కోట్ల వార్షిక వేతనం .. ఇంత పెద్ద ప్యాకేజీ అంటే మామూలా? ఇది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు గత ఏడాది ఇచ్చిన పేమెంట్.ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈవిషయాన్ని వెల్లడించింది. దీంతో విజయకుమార్ ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా నిలిచారు.  విజయ కుమార్ ఆదాయంలో నాలుగింట మూడొంతులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో పొందుపరచ బడిందని కంపెనీ స్పష్టం చేసింది. ” మా కంపెనీ నుంచి విజయకుమార్ ఎలాంటి వేతనం పొందలేదు. అయితే మా అనుబంధ సంస్థ అయిన ‘హెచ్ సీఎల్ అమెరికా ఇంక్’ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్ల (రూ. 123. 13 కోట్లు) పారితోషికం అందుకున్నారు” అని వార్షిక నివేదికలో పేర్కొంది.  విజయకుమార్ వార్షిక మూల వేతనం 2 మిలియన్ డాలర్లు కాగా, వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని  తెలిపింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆయన 0.02 మిలియన్ డాలర్ల మొత్తం ఇతర ప్రయోజనాలను పొందారు. హెచ్ సీఎల్ కంపెనీ దీర్ఘకాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్ డాలర్ల మొత్తంతో ఆయన జీతం 16.52 మిలియన్ డాలర్లకి (రూ. 123.13 కోట్లు) చేరుకుందని పేర్కొంది. ‘12.5 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ప్రోత్సాహకం అందుకోవడం మినహా 2021-22లో  ఆర్థిక సంవత్సరంలో విజయ్ కుమార్ వేతనంలో ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది ఆయన టార్గెట్స్ చేరుకునే తీరు ఆధారంగా నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తాం’ అని వివరించింది.