Site icon HashtagU Telugu

Bengaluru Auto Driver : సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఈ 74 ఏళ్ల ఆటోడ్రైవ‌ర్‌.. ఎందుకో తెలుసా?

Auto Driver Aiyer

Auto Driver Aiyer

30 ఏళ్లు రాగానే అంతా అయిపోయింద‌నుకునే ఈ కాలం కుర్రాళ్ల‌కు అత‌నో ఇన్‌స్పిరేష‌న్‌. 8 గంట‌లు ప‌నిచేసి నా వల్ల కాద‌నుకునే నేటి త‌రానికి ఆయ‌న డెడికేష‌న్ ఒక డిక్టేష‌న్‌. అవును.. అత‌నే ఇంట‌ర్నెట్‌లో లేటెస్ట్ సెన్సేష‌న్‌.. 74 ఏళ్ల ఆటోడ్రైవ‌ర్ రామ‌న్‌. నిన్న‌టివ‌ర‌కూ మ‌న‌లో ఒక‌డిగా జీవితాన్ని పాజిటివ్‌గా లీడ్ చేస్తున్న ఈయ‌న స్టోరీని నికితా అయ్య‌ర్ అనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది.

ఒక గురువారం రామ‌న్‌తో నికితా జ‌రిపిన 45 నిమిషాల సంభాషణ.. జీవితం ప‌ట్ల ఆమె దృక్ప‌ధాన్నే మార్చేసింది. ఎలా ఉన్నామ‌న్న‌ది కాదు ఎంత సంపాదిస్తున్నామ‌న్న‌ది కాదు ఎలా లైఫ్‌ని బ‌తుకుతున్నామ‌న్న‌దే ముఖ్య‌మ‌న్న స‌త్యాన్ని తెలియ‌జేసింది.

త‌న ఆఫీసుకు బ‌య‌ల్దేరిన నికితా అయ్య‌ర్‌కు రోడ్డుమీద చిరునవ్వుతో వ‌చ్చి ఎక్క‌డికి వెళ్లాలి మేడం అంటూ 74 ఏళ్ల రామ‌న్ గొంతు విన‌బ‌డింది. చూస్తే పెద్ద వ‌య‌సు.. అదీ ఆటో డ్రైవ‌ర్‌.. ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతుండ‌డం చూసి ఆమె ఆశ్చ‌ర్య‌పోయింది. త్వ‌ర‌గా ఆఫీసుకు వెళ్లాలి లేట‌యింది అంటే.. ప్లీజ్ డోంట్ వ‌ర్రీ.. ఐ విల్ డ్రాప్ యు ఆన్ టైమ్ అన్నాడు రామ‌న్‌. రామ‌న్ ఇంగ్లీష్ ప్లూయ‌న్సీ చూసి ఇంప్రెస్ అయిన నికితా..మీ గురించి చెప్పండ‌ని అడిగింది. అత‌ను చెప్పిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య‌పోయింది నికితా.

రామ‌న్ గ‌తంలో ముంబైలోని ఒక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. ఎంఏ, ఎంఈడీ చ‌దివిన ఆయ‌న, రిటైర‌యిన త‌ర్వాత ఖాళీగా ఉండ‌కుండా త‌న కొడుకుల‌పై ఆధార‌ప‌డ‌కుండా ఉండేందుకు ఆటో నడుపుతున్నాన‌ని చెప్పుకొచ్చాడు. క‌ర్నాట‌క‌లో ఎలాంటి ఉద్యోగం దొర‌క్క‌పోవ‌డంతో ముంబై వెళ్లి సెటిల‌య్యాయ‌న‌ని, పోవాయ్‌లో 60 ఏళ్లు ప‌నిచేసి 20 ఏళ్ల కింద‌టే రిటైర‌యిన‌ట్టు చెప్పాడు.

 టీచ‌ర్ల‌కు ఎక్కువ జీతం రాదు. నెల‌కు 10 నుంచి 15 వేలు వ‌చ్చేవి. పెన్ష‌న్ లేదు. ఆటో న‌డిపితే రోజుకు 700 నుంచి 1500 వ‌స్తుంది. నాకు నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌(భార్య‌)కి అది స‌రిపోతుంది– అని న‌వ్వుతూ చెప్పాడు అయ్యర్‌.

అయ్య‌ర్ కుమారుడు త‌ల్లిదండ్రుల ఇంటికి ప్ర‌తీ నెల అద్దె క‌డ‌తాడు. అంతకుమించి నేను వాడిపై ఆధార‌ప‌డ‌ను అని ధైర్యంగా చెప్తారు అయ్య‌ర్‌. మా జీవితాల‌ను మేం హ్యాపీగా సంపాదించుకుని బ‌తుకుతున్నామంటారు.

Blog Post Link : https://www.linkedin.com/embed/feed/update/urn:li:share:6912671110782234624

అయ్య‌ర్‌తో జ‌రిగిన ఈ సంభాష‌ణ‌ని అంతా ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసి లింక్‌డ్ ఇన్ లో పోస్ట్ చేసింది నికితా అయ్య‌ర్‌. మ‌న‌కు క‌నిపించ‌ని ఇలాంటి హీరోల నుంచి చాలా నేర్చుకోవాల‌ని క్యాప్ష‌న్ పెట్టింది. వేలాదిమంది యూజ‌ర్లు నికితా పోస్ట్‌కి స్పందిస్తున్నారు. 80వేల‌కు పైగా యూజ‌ర్స్ ఈ పోస్ట్‌ని లైక్ చేశారు. త‌మ జీవిత అనుభ‌వాల‌ను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు.