Site icon HashtagU Telugu

MBBS Student: రైల్లో పురుడు పోసిన మెడికల్ స్టూడెంట్!

Mbbs

Mbbs

సికింద్రాబాద్ – విశాఖ దురంతో ట్రైన్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని పురుడు పోసి అందరి మన్ననలు పొందింది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో నొప్పులు మొదలయ్యాయి.వెంటనే అదే బోగీలో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థిని డెలివరీ చేసింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రయాణంలో వారిని కాపాడిన విద్యార్థినిని అందరూ అభినందించారు.

అనకాపల్లి స్టేషన్‌లో రైలు ఆగడంతో మిగిలిన సహ ప్రయాణికులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రసవం తర్వాత బిడ్డ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రయాణంలో తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని అందరూ అభినందించారు. ఈ వార్త వైరల్ గా మారడంలో నెటిజన్స్ సైతం ఆమెను మెచ్చుకుంటున్నారు.