Maoists : వరంగల్ పోలీసుల ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25వేలు అందజేశాం. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు.
Read Also: Advanced Chat Privacy: వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్.. ఏమిటిది ?
ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. సరెండర్ అయిన వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలు ఆ ఆపరేషన్ చేపట్టాయని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయస్టులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు ఏవోబీ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు.
పోలీసులు, మావోయిస్టుల కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, వారికి పునరావాస పథకాలు, శిక్షణా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలు, మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించడానికి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించబడ్డాయి. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు, మావోయిస్టుల కుటుంబ సభ్యులతో సమన్వయం పెంచి, మరిన్ని లొంగుబాట్లను సాధించడానికి కృషి చేస్తున్నారు. ఇది, మావోయిస్టు ఉద్యమానికి ముగింపు పలికే దిశగా ఒక కీలక అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లొంగుబాట్లు, తెలంగాణ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి సాధించడానికి, మావోయిస్టుల సమస్యను పరిష్కరించడానికి కీలకమైన చర్యలుగా భావించబడుతున్నాయి.
Read Also: Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ