Sachin Vs Massive Protest : భారత రత్న సచిన్ టెండూల్కర్.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు అంబాసిడర్‌గా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు. ఒకవేళ ఇలాగే చేస్తే భారత రత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని సచిన్ ను డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావ్ సారథ్యంలో సచిన్ ఇంటి ముందు గురువారం పలువురు ఆందోళనకు దిగారు. సచిన్ కు భారత రత్న పురస్కారం లేకుంటే.. తాము ఆందోళనకు దిగే వాళ్లమే కాదని ఓం ప్రకాశ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభం కన్నా దేశ శ్రేయస్సే ముఖ్యమని హితవు పలికారు.
Also read : CBN Social Media : పొత్తు కోసం చంద్రబాబుపై ఐటీ ప్రయోగం?
‘‘ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాలనుకుంటే.. సచిన్ భారత రత్నను వెనక్కి ఇచ్చేయాలి’’ అని ఓం ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈవిషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని రోజుల కిందటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఓం ప్రకాశ్ లేఖ (Sachin Vs Massive Protest) కూడా రాశారు. స్పందన రాకపోవడంతో.. ఫ్లకార్డులు, బ్యానర్లు చేతపట్టిన తన కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.