Zuckerberg Vs Musk : ప్రపంచ కుబేరుల జాబితా..మస్క్‌ని వెనక్కి నెట్టిన జుకర్‌బర్గ్‌..!

Zuckerberg Vs Musk: మెటా కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌9Mark Zuckerberg) మూడో సంపన్న వ్యక్తిగా నిలిచారు. టెస్లా కంపెనీ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌(Elon Musk)ను వెనక్కినెట్టి మూడోస్థానానికి చేరుకున్నారు. మార్చి మొదట్లో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌.. నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది మస్క్ సంపద 48.4 బిలియన్ డాలర్లు తగ్గగా.. జుకర్‌ బర్గ్‌ సంపద 58.9 డాలర్లకు పెరిగింది. మెటా షేర్లు శుక్రవారం గరిష్ఠానికి చేరాయి. నవంబర్ […]

Published By: HashtagU Telugu Desk
Mark Zuckerberg’s wealth exceeds Elon Musk’s for the first time since 2020

Mark Zuckerberg’s wealth exceeds Elon Musk’s for the first time since 2020

Zuckerberg Vs Musk: మెటా కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌9Mark Zuckerberg) మూడో సంపన్న వ్యక్తిగా నిలిచారు. టెస్లా కంపెనీ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌(Elon Musk)ను వెనక్కినెట్టి మూడోస్థానానికి చేరుకున్నారు. మార్చి మొదట్లో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌.. నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది మస్క్ సంపద 48.4 బిలియన్ డాలర్లు తగ్గగా.. జుకర్‌ బర్గ్‌ సంపద 58.9 డాలర్లకు పెరిగింది. మెటా షేర్లు శుక్రవారం గరిష్ఠానికి చేరాయి. నవంబర్ 16, 2020 తర్వాత బ్లూమ్‌బెర్గ్ సంపన్నుల ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాల్లో జుకర్‌బర్గ్ కనిపించడం ఇదే మొదటిసారి.

We’re now on WhatsApp. Click to Join.

మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద ప్రస్తుతం 187 బిలియన్‌ డాలర్లు కాగా.. ఎలాన్‌ మస్క్‌ సంపద 181 బిలియన్లుగా ఉన్నది. ఈ ఏడాది టెస్లా షేర్లు 37శాతం పడిపోయాయి. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లో చెత్త స్టాక్‌గా నిలిచింది. ఈవీ డిమాండ్‌లో మందగమనం.. చైనాలో పెరుగుతున్న పోటీ, జర్మనీలో ఉత్పత్తి సమస్యల కారణంగా కంపెనీ నష్టపోయింది. మరో వైపు మెటా కంపెనీ 49శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎల్‌వీఎంహెచ్‌ మోయెట్‌ హెన్నెస్సీ లూయిట్‌ విట్టన్‌ చైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ మొదటి స్థానంలో ఉండగా.. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు.

Read Also: Swetha Naidu: తల్లిదండ్రుల ముందు కన్నీరు పెట్టుకున్న శ్వేతా నాయుడు.. స్టేజ్ పై అలా!

ఈ జాబితాలో భారత్‌ నుంచి టాప్‌-100 జాబితాలో 10 మంది భారతీయులకు చోటు దక్కింది. రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ 11వ స్థానంలో ఉండగా.. అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 14వ స్థానంలో నిలిచారు. 39వ స్థానంలో షాపూర్‌ మిస్త్రీ, 44వ స్థానంలో శివ్‌ నాడార్‌, 51వ స్థానంలో సావిత్రి జిందాల్‌, 64వ స్థానంలో అజిమ్‌ ప్రేమ్‌జీ, 68వ స్థానంలో దిలిప్‌ షాంగ్వీ, 86వ స్థానంలో రాధాకృష్ణ దమానీ, 95వ స్థానంలో సైరస్‌ పూనావాలా, 96వ స్థానంలో లక్ష్మి మిట్టల్‌ చోటు దక్కించుకున్నారు.

  Last Updated: 06 Apr 2024, 09:25 PM IST