IIT Baba : మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఇటీవల తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ..ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్‌లు చేశారు. తాజాగా అతడు జైపుర్‌లో కొందరు వ్యక్తులతో తగాదాకు దిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆయన వద్ద లభించిన గంజాయి అనుమతించదగిన పరిమితిలో ఉండడంతో కొన్ని గంటల తర్వాత ఆయనను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను ఎటువంటి తగాదాలకు వెళ్లలేదని తన అనుచరులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నానని చెప్పారు. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, మహాకుంభమేళా 2025లో ఐఐటీబాబా ఫేమ్ అయ్యారు. తన ఆథ్యాత్మిక ప్రయాణాన్ని, అనుభవాలను , చిన్ననాటి గాయాలను తనను ఎలా ఆథ్యాత్మిక మార్గంలో నడిపించాయో వివరించడం ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ఇంతలోనే వివాదాలతో ఐఐటీ బాబాను షిప్రా పాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Prakash Raj Vs PM Modi: మణిపూర్‌కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్