Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 92 ఏళ్ల వయసులో ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అసీమ్ అరుణ్ కూడా ఓ పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రధాన అంగరక్షకుడిగా ఉన్న ఆ రోజుల గురించి అసీమ్ అరుణ్ చెప్పారు.
మన్మోహన్ సింగ్ భద్రతా గార్డుగా పనిచేసిన అశీమ్ అరుణ్ ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆయన మారుతి 800 పట్ల ఉన్న ప్రేమను వివరించారు. అశీమ్ అరున్ తన పోస్ట్‌లో ఇలా రాశారు. “నేను 2004 నుండి మూడు సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ బాడీ గార్డ్ గా పనిచేశాను. ప్రధాన మంత్రి భద్రతలో కీలకమైన భాగం ‘క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్’. నేను ఆ టీం నేతగా పనిచేశాను. ఈ టీమ్ ప్రధాని నుంచి ఎప్పుడూ దూరం ఉండదు. ఒక బాడీగార్డ్ కి ఎప్పుడూ ప్రధానితో ఉండాల్సిన బాధ్యత ఉంటుందని తెలిపారు.
Also Read: Manmohan Singh : మన్మోహన్ సింగ్-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?
మన్మోహన్ సింగ్ వద్ద ఒక్క కారు మాత్రమే ఉండేది. అది మారుతి 800. ప్రధాన మంత్రి నివాసంలో బీఎంవీ లాంటి భారీ కార్లు ఉండేవి. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేవారు..అశీమ్ నాకు ఈ కారులో ప్రయాణించడం ఇష్టం లేదు. నా కారు మారుతి 800 అంటేనే నాకు ఇష్టం అని చెప్పినట్లు అశీమ్ తెలిపారు.
అశీమ్ ఇంకా రాస్తూ.. నేను ఆయనతో చెప్పుకునే ప్రయత్నం చేసేవాడిని, ‘సార్, ఈ కారు మీ భద్రత కోసం మాత్రమే, దీనిలోని భద్రతా ఫీచర్లు SPG ద్వారా సెట్ చేయబడినవి. కానీ, భద్రతా కారు కేడ్ సమయంలో మారుతి 800 ముందు నుంచి వెళ్ళేటప్పుడ, ఆయన ఆ కారు వైపు గమనించేవారు. అది మళ్లీ ఆయనకి ఆ సంకల్పాన్ని గుర్తు చేసేలా ఉండేది. ‘నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని, నా బాధ్యత సాధారణ ప్రజల కోసం కృషి చేయడం.’ కోట్ల రూపాయల కార్లు ప్రధాని కొరకు ఉండవచ్చు. కానీ నా కారు మాత్రం మారుతి 800 అని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఎప్పుడూ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం, భౌతికవాదం నుండి దూరంగా ఉన్నారు. ఆయన ఎప్పటికీ తన బాధ్యతలను అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు తన సాధారణ జీవితంతో ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.