మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్..గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స తీసుకుంటూనే రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు నివాళ్లు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు , సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. దీనిని కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
విదేశీ పర్యటనల నుంచి తిరిగివస్తూ తనతోపాటు ఉన్న మీడియా ప్రతినిధులతో విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించడం మన్మోహన్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఇలా చేయడం ద్వారా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలను స్పష్టంగా వివరిస్తూ మీడియాకు సమయాన్ని కేటాయించడం ఆయన నైపుణ్యాన్ని ప్రతిబింబించింది. విమానంలో ప్రెస్ మీట్ నిర్వహించడం మన్మోహన్ స్టైల్‌గా అంత మాట్లాడుకునేవారు. ఆర్థిక మంత్రి తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వంటి ఆర్థిక సంస్కరణలు ఆయన దూరదృష్టికి సాక్ష్యాలు. ఆర్థిక వృద్ధిలో భారతదేశం ప్రపంచంలో గుర్తింపు పొందటానికి ఆయన తీసుకున్న చర్యలు ముఖ్య కారణమయ్యాయి. మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వం అతిగా మాట్లాడని, శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తి అని దేశమంతా గౌరవించింది. గొప్ప ఆలోచనాశక్తి ఉన్నప్పటికీ, అది కేవలం పని ద్వారా చూపించడం ఆయన ప్రత్యేకత. విమర్శలు ఎదురైనా తన పని మీద దృష్టి సారించి దేశ అభివృద్ధికి పాటుపడిన నాయకుడిగా ఆయన నిలిచారు.
ప్రస్తుతం మన్మోహన్ భౌతికకాయానికి నివాళ్లు అర్పిస్తున్నారు. రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈరోజు ఆయన భౌతికదేహాన్ని నివాసంలోనే సందర్శనార్థం ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also : Manmohan Singh : మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌కు బలమైన వికెట్‌గా ఎలా మారారు..!