Site icon HashtagU Telugu

Dressed as Lord Shiva: ధరల పెరుగుదలకు నిరసనగా పరమశివుడి వేషం.. చివరికి అరెస్ట్?

Assam

Assam

ప్రస్తుతం రోజురోజుకు మార్కట్ లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మంచి నూనె, నిత్యవసర సరుకులు, కాయగూరలు ఇలా ప్రతి ఒకటి ధరలు మండిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు సరుకులు కొనాలి అన్న, మార్కెట్ లోకి వెళ్ళాలి అన్న భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మార్కెట్లో చాలా వస్తువులు ధరలు పెరిగిపోయాయి. అయితే మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న వస్తువులు ధరలు చాలవు అన్నట్లు ఆ ధరలను మరింత పెంచుతూ పోతున్నారు.

దీనితో సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇది ఇలా ఉంటే ఇదే విషయంపై ఒక వ్యక్తి ధరలు పెరుగుతున్నందువల్ల శివుడి వేషం వేసి వీధి నాటకంతో ఏసన్న తెలపడంతో అతనిని జైల్లోకి పంపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు నిరసనగా శివుడి వేషం వేసుకుని వీధినాటకంతో నిరసన తెలిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇలా శివుడి వేషం వేసి వీధి నాటకంతో నిరసన తెలుపడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక బజరంగ్ దళ్ దంతాలు ఫిర్యాదు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన అసోంలోని నాగావ్‌లో చోటు చేసుకుంది. ధరల పెరుగుదలను నిరసిస్తూ బిరించి బోరా అనే ఒక వ్యక్తి శివుడి వేషం ధరించి పార్వతి వేషధారితో కలిసి వీధినాటకం వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ బోరా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోరాను అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరు అతనికి అనుగుణంగా స్పందించగా మరికొందరు మాత్రం అతనికి వ్యతిరేకంగా స్పందించారు. దీంతో ఈ విషయం పై ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ జోక్యం చేసుకొని ఆయన ఆదేశాల మేరకు బిరించిన పోలీసులు బోరాను విడుదల చేశారట.