Stunt : విమానం రెక్కపై నడుచుకుంటూ కనిపించిన రియల్ సూపర్ మ్యాన్…

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉపయోగించిన రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 05:00 AM IST

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉపయోగించిన రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. కొందరు కోరి ప్రమాదాలను సైతం తెచ్చుకుంటున్నారు. గతంలో కొందరు ఎత్తైన భవంతుల మీద సెల్ఫీ వీడియోలు తీసి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. మరికొందరు ప్రమాదకరమైన జంతువుల దగ్గరకు వెళ్లి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇదంత వేలం వెర్రి అని కొట్టి పారేసే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ, ఈ వైరల్ వీడియోలను చూసే వారు అంతకు మూడు రెట్లు ఉన్నారు. అందుకే రకరకాల ఫీట్లను చేస్తూ వీడియోలను పెడుతున్నారు.

న్యాంగ్ న్యాంగ్ బీచ్ వీడియో
తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియా యూజర్లను భయపడి థ్రిల్ ఫీలయ్యేలా చేశాడు. ఆ వ్యక్తి ఆగి ఉన్న విమానం రెక్కపై నడుచుకుంటూ దాని చివరి వరకు వెళ్లి ఫోజిచ్చి వచ్చాడు. అయితే ఇందులో వింతేమి ఉంది అనుకోవచ్చు. ఆ విమానం ఓ పర్వతంపై పార్క్ చేసి ఉంది. దాని విమానం రెక్క పై నుంచి కిందకు జారిపడితే కొన్ని వేల అడుగుల లోతులో పడటం ఖాయం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో, ఆ వ్యక్తి నిర్భయంగా తన వీడియోను ఆ ఎత్తులో చిత్రీకరించాడు. మీడియా నివేదికల ప్రకారం, ఈ వీడియో ఇండోనేషియాలోని న్యాంగ్-న్యాంగ్ బీచ్ లో రికార్డు అయ్యింది. ఇది కాకుండా, వీడియోలో కనిపిస్తున్న విమానం బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీకి చెందినది.

ఇప్పటి వరకు ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో ఎర్త్‌పిక్స్ ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోపై యూజర్లు రకరకాల కామెంట్స్ చేశారు.