Girlfriend video: లవర్ తో షాపింగ్.. అడ్డంగా బుక్కైన భర్త, వీడియో వైరల్!

తన ప్రియురాలితో షాపింగ్ చేస్తుండగా, భార్య చేతికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ భర్త. భార్య చేతిలో దెబ్బలు తిన్న ఈ వీడియో సోషల్

Published By: HashtagU Telugu Desk
Viral

Viral

తన ప్రియురాలితో షాపింగ్ చేస్తుండగా, భార్య చేతికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ భర్త. భార్య చేతిలో దెబ్బలు తిన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి భార్య తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కర్వా చౌత్‌ ఫెస్టివల్ లో భాగంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆమె భర్త మరో అమ్మాయి (ప్రియురాలు) కలిసి కనిపించాడు. ఏమి తెలియదన్నట్టుగా షాపింగ్ చేస్తున్నాడు.

ఇదీ గమనించిన భార్య భర్తను అక్కడే నిలదీసింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డిన భర్తను అందరి ముందే చితకబాదింది. విషయం తెలుసుకున్న తోటి మహిళలు సైతం భర్తను కొట్టారు. అక్కడితో ఆగకుండా ప్రియురాలికి బుద్ధి చెప్పారు. ఈ ఘటనతో షాపింగ్ క్లాంప్లెక్స్ మొత్తం రద్దీగా మారింది. అయితే భర్త కూడా కర్వా చౌత్ సందర్భంగా ప్రియురాలితో కలిసి షాపింగ్‌ చేయడానికి వెళ్లడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  Last Updated: 14 Oct 2022, 04:20 PM IST