గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్ట్ లలో నిత్యం ఎంతోమంది దొరికిపోతుంటారు. బాడీలో ఎక్కడ పడితే అక్కడ.. దుస్తుల్లో ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ (Man Swallows 7 Gold Biscuits) చేస్తూ చాలామంది దొరికిపోయిన ఘటనలను మనం గతంలో చూశాం. తాజాగా దుబాయ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇంతిజార్ అలీ అనే వ్యక్తి .. కస్టమ్స్ అధికారులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. స్పీడ్ గా పరుగు తీశాడు. అతడు తీసుకొచ్చిన లగేజీలో గోల్డ్ లేదు. అయినా ఎందుకు రన్ చేశాడో అధికారులకు అర్ధం కాలేదు. దీంతో వారు అతడికి బాడీ స్కాన్ చేశారు. ఏం దొరకలేదు. చివరకు ఆ యువకుడిని ముంబైలోని JJ ఆసుపత్రికి తరలించారు.
కడుపు నుంచి ఇలా తీశారు ..
ప్లాస్టిక్ రేకులో చుట్టిన 7 బంగారు ముక్కలను అతడు మింగాడని ఎక్స్-రే రిపోర్ట్ లో తేలింది. నిందితుడి కడుపులో నుంచి దాదాపు 240 గ్రాముల బంగారాన్ని వైద్యులు బయటికి తీశారు. ఇంతిజార్ అలీ బంగారు బిస్కెట్‌లను మలం ద్వారా విసర్జించడానికి, సహజంగా కోలుకోవడానికి కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో అధికంగా ఫైబర్ డైట్ ను అందించారు. కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకే ఇలా చేశానని(Man Swallows 7 Gold Biscuits) ఇంతిజార్ అలీ దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అతడిపై కస్టమ్స్ చట్టం కింద అభియోగాలు మోపారు.