అయ్యోయ్యో వద్దమ్మా.. సాక్స్ ఆర్డర్స్ చేస్తే ‘బ్రా’ వచ్చింది!

ఆన్ లైన్ డెలివరీలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే.. మరో వస్తువు చేతిలోకి వస్తుంటుంది. ఆన్ లైన్ వాడకం పెరిగిపోవడంతో ఈ తరహా సంఘటనలు ఎక్కువవుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 20, 2021 / 05:59 PM IST

ఆన్ లైన్ డెలివరీలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే.. మరో వస్తువు చేతిలోకి వస్తుంటుంది. ఆన్ లైన్ వాడకం పెరిగిపోవడంతో ఈ తరహా సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఫుట్ బాల్ ప్లేయర్ ఒకరు సాక్స్ ఆర్డర్ చేస్తే.. ఆడవాళ్లు ధరించే బ్రా వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కశ్యప్ స్వరూప్ అనే వ్యక్తికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. పాతవి చినికిగిపోవడంతో కొత్త సాక్సులు కొనాలనుకున్నాడు. అయితే మింత్ర అనే వెబ్ సైట్ లో వాటిని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేశాడు. ఒకరోజు ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఇష్టంతో బ్యాక్స్ ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. సాక్సులు బదులు బ్రా వచ్చింది. అయితే ఈ ఆర్డర్ తనది కాదమోనని, పొరపాటుగా వేరే అడ్రస్ అయ్యిఉంటుందని చెక్ చేసి చూడగా తన పేరుతోనే ఉంది. చివరకు చేసేదేమీలేక బ్రా బాక్స్ రిటర్న్ చేయాలనుకున్నాడు. మళ్లీ సైట్ లో రిక్వెస్ట్ పెట్టగా.. ‘సారీ బ్రాను రిప్లేస్ చేయలేం’ అనే సమాధానం వచ్చింది.

అయితే ఫ్రస్టేట్ అయిన ఫుట్ బాల్ ప్లేయర్ తనకు జరిగిన ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. సాక్సులు ఆర్డర్ ఇస్తే బ్రా రావడమేంటి? అని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. దీంతో బ్రా ఫొటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. సైట్ నిర్వాహకులు మాత్రం రెస్పాండ్ అవుతూ.. సారీ అంటూ రిప్లైయ్ ఇచ్చారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం పుట్ బాల్ ప్లేయర్ ను ఓ ఆట ఆడేసుకున్నారు. ‘ఇంతకీ ఆ మహిళ బ్రా వేసుకుందా?’ లేదా? అని, ‘బ్రా సైజ్ ఒకే నా’ అంటూ సెటైర్స్ వేశారు.