Site icon HashtagU Telugu

Dating Scammer: డేటింగ్ తో దిమ్మదిరిగే షాకిచ్చిన మహిళ.. 14 కోట్లు మోసపోయిన విదేశీయుడు!

Dating Scammer

Dating Scammer

మనుషుల జీవితాల్లో టెక్నాలజీ భాగమైంది. అయితే టెక్నాలజీ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతే కంటే ఎక్కువే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఓటీపీ అంటూ, ఆధార్ అప్ డేట్ అంటూ, ఆకర్షణీయమైన గిఫ్టులు వచ్చాయంటూ అమాయకులను మోసగిస్తున్నారు. అయితే డేటింగ్ (Dating Scammer) కారణంగా ఇప్పటికే అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోయిన విషయం తెలిసిందే.

శారీరక ఆకర్షణలో పడిన యువత తరచుగా సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఆన్ లైన్ లో టిండర్ లాంటి డేటింగ్ యాప్స్ ను అడ్డగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. డేటింగ్ మాయలో పడిన ఓ వ్యక్తి 14 కోట్లకు పైగా మోసపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. డేటింగ్ యాప్ డిజిటల్ మనీలో పెట్టుబడి పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 కోట్లు నష్టపోయి లబోదిబోమంటున్నాడు.

స్కామ్ బాధితుడు హాంకాంగ్‌లో నివసిస్తున్న 55 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి. అతనికి టిండర్‌ డేటింగ్ ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అంతేకాదు.. ఓ మహిళతో శృంగార సంబంధాన్ని ప్రారంభించాడు. WhatsAppలో కనెక్ట్ అయి సంబంధాలు కొనసాగించారు. సింగపూర్‌లో ఉంటున్న సదరు మహిళా పెట్టుబడి బ్రోకర్‌గా నటించి ఆకట్టుకుంది. ఇద్దరూ సంబంధాన్ని పెంచుకున్న తర్వాత, డిజిటల్ మనీలో (Dating Scammer) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

సదరు మహిళ డిజిటల్ మనీలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రాబడిని అందించవచ్చని బాధితుడికి చెప్పబడింది. దీంతో ఆశకు పోయిన వ్యక్తి  మొత్తం 14.2 మిలియన్ హాంకాంగ్ డాలర్‌లను, INRలో రూ. 14 కోట్లకు పైగా, తొమ్మిది వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. మార్చి 6 నుంచి మార్చి 23 మధ్య జరిగిన 22 లావాదేవీల్లో ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు తిరిగి రాకపోవడంతో బాధితుడు ఏదో తప్పు జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. చివరకు ఆలస్యంగా మోసపోయానని (Dating Scammer)  బాధితుడు గ్రహించాడు.

Also Read: Dasara Box office: బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న దసరా.. 100 కోట్ల క్లబ్ లోకి నాని మూవీ!