Gold Smuggling : విగ్గులో..మలద్వారంలో బంగారం దాచి స్మగ్లింగ్..ఐడియా చూసి షాకైన పోలీసులు

అరబ్బు దేశాల నుంచి బంగారం అక్రమ రవాణా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.

Published By: HashtagU Telugu Desk
Gold Smuggling

Gold Smuggling

అరబ్బు దేశాల నుంచి బంగారం అక్రమ రవాణా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా అబుదాబి నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన ఓ వ్యక్తిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు ఖంగు తిన్నారు. నున్నగా గుండు గీయించుకొని అతగాడు వేసుకున్న విగ్గు ను తీసి చూసి.. వారు ఆశ్చర్యపోయారు. విగ్గులో నుంచి రూ.30.55 లక్షలు విలువ చేసే బంగారం బయటపడింది. విగ్గులో దాచిన బంగారం బరువు దాదాపు 630.45 గ్రాములు ఉందని గుర్తించారు. ‘ ఇంకా ఎక్కడెక్కడ బంగారం దాచావో.. చెప్పు’ అని అతడిని గట్టిగా విచారించడంతో మరో షాకిచ్చే విషయం చెప్పాడు. తన మలద్వారంలోనూ బంగారం దాచినట్టు వెల్లడించారు. దీంతో అందులోని బంగారాన్ని కూడా బయటికి తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

https://twitter.com/santoshsaagr/status/1517024997751259136

 

  Last Updated: 21 Apr 2022, 12:37 PM IST