Site icon HashtagU Telugu

Marriage@95: అతడికి 95.. ఆమెకు 84.. 23 ఏళ్ల ప్రేమకు వివాహాభిషేకం!!

95 Years Groom

95 Years Groom

అతడి వయసు 95.. ఆమె వయసు 84.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు!! ఈ అపూర్వ ప్రేమగాధ బ్రిటన్ లోని కార్డిఫ్ నగరంలో మే నెల 19న ఆవిష్కృతమైంది. నగరంలోని కల్వరి బాప్టిస్ట్స్ చర్చిలో 95 ఏళ్ల జూలియన్ మోలే, 84 ఏళ్ల వేలెరీ విలియన్స్ పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి పరిచయం చాలా పాతది.

23 ఏళ్ల క్రితమే వీరి మధ్య స్నేహం చిగురించింది. అది క్రమక్రమంగా ప్రేమగా మారింది. ఎట్టకేలకు 23 ఏళ్ల తర్వాత లేటు వయసులో .. హాటు ప్రేమ.. పెళ్లి గా రూపాన్ని సంతరించుకుంది. జూలియన్ మోలే చేసిన పెళ్లి ప్రతిపాదనకు వధువు వేలెరీ విలియన్స్ ఓకే చెప్పింది. కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

పెళ్లి కొడుకు జూలియన్ మోలే.. ఈ రోజును తన జీవితానికి కొత్త సంవత్సరపు తొలిరోజుగా అభివర్ణించాడు. వచ్చే ఏడాది తన భార్య తో కలిసి హనీమూన్ కోసం స్వదేశం ఆస్ట్రేలియా కు వెళ్తానని చెప్పాడు. దయ, సానుభూతి, ప్రేమభావం కలిగిన స్త్రీ తనకు భార్య కావడం గొప్ప అదృష్టమని పేర్కొన్నాడు.