Site icon HashtagU Telugu

Jharkhand Horror:కెమెరాలో చిక్కిన జార్ఖండ్ భయానక దృశ్యం..!!

Jharkhand Mishap1 Imresizer

Jharkhand Mishap1 Imresizer

జార్ఖండ్ లోని డియోఘర్ జిల్లాలోని రోప్ వే కేబుల్ కార్ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 40 గంటల పాటు శ్రమించి కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన 40 మందికిపైగా ప్రజలను రెస్య్కూ ఆపరేషన్ ద్వారా రక్షించారు. ఈ రెస్య్కూలో రెండు వైమానిక దళ హెలికాప్టర్ లతోపాటుగా పదుల సంఖ్యలో అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సంయుక్త బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా…ఇందులో ఓ మహిళ గాయాలతో మరణించింది. మరో ఇద్దరు హెలికాప్టర్ రెస్య్కూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ కేబుల్ కార్లను ఓ ప్రైవేట్ కంపెనీ నడుపుతుందని..ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అక్కడి నుంచి పారిపోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను నిర్దారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. రెస్య్కూ ఆపరేషన్ పై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక ప్రదేశమైన డియోఘర్ లోని త్రికూట్ పర్వతంపై నిర్మించిన రోప్ వే ప్రమాదం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని బాబా బైద్యనాథ్ ను ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Exit mobile version