Site icon HashtagU Telugu

Viral Video : వైర‌ల్ వీడియో.. మద్యం మత్తులో గోడ అనుకుని…?

Sambar Imresizer

Sambar Imresizer

తమిళనాడులో మ‌ద్యం మ‌త్తు ప్రాణాల మీద‌కు తెచ్చింది. మద్యం మత్తులో కొంతమంది ఏం చేస్తుంటారో వారికే తెలియదు..పీకల్లోతు మద్యం, మత్తుపదార్థల కారణంగా ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. తమ ప్రాణాలనే కాదు..ఇంటిల్లిపాదిని చిక్కుల్లోకి నెట్టేస్తుంటారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులని ఒంటరి చేసి అకాలంగా మృత్యువాతపడుతుంటారు.. తాజాగా తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబరులో పడ్డాడు. తమిళనాడులోని మధురైలో పలంగానట్టిలోని గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి తూలుతూ వంటలు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. అన్నదానానికి భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకుని దానిపై కూర్చోబోయి అందులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.ముత్తు కుమార్‌ను రక్షించే క్రమంలో పలువురు గ్రామస్తులకు సైతం సాంబారు మీదపడి గాయాలయ్యాయి. దీంతో పండుగ రోజు పలంగానట్టి గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Exit mobile version