Anand Mahendra Tweet: మహీంద్రా కారు కొని బ్లెస్సింగ్స్ అడిగిన వ్యక్తికి.. ఆనంద్‌ మహీంద్ర రిప్లై!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సామాన్యుల ట్వీట్స్ కు కూడా స్పందించే ఏకైక పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.

Published By: HashtagU Telugu Desk
Mahendra Imresizer

Mahendra Imresizer

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సామాన్యుల ట్వీట్స్ కు కూడా స్పందించే ఏకైక పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.
మహీంద్ర గ్రూప్ చైర్‌పర్సన్ గా ఉన్న.. కించిత్తు అహంకారం కూడా ఆయన కామెంట్స్ లో కనిపించదు. తాజాగా ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

“10 సంవత్సరాలు  కష్టపడి కొత్త మహీంద్రా XUV 700 కారు కొన్నాను. సార్ మీ ఆశీర్వాదం కావాలి” అంటూ  అశోక్‌ కుమార్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్‌ మహీంద్రను ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన ఆనంద్‌ మహీంద్ర “ధన్యవాదాలు.. కానీ వాస్తవానికి మా కంపెనీ కారును ఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్” అంటూ ట్వీట్ చేశారు. దీంతో  స్పందనగా అశోక్‌కుమార్‌  ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ట్వీట్ ద్వారా ఆనంద్‌ మహీంద్ర మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందం టూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు.

 

‘మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఒ​క యూజర్‌  కామెంట్‌ చేశారు. ఆనంద్ మహీంద్రా తన వ్యాఖ్యలతో అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తం అవుతోంది.

  Last Updated: 03 Aug 2022, 12:15 AM IST