Site icon HashtagU Telugu

300 Luxury Cars : 47వేల కోట్ల ఆస్తి.. 300 లగ్జరీ కార్‌లు.. కొత్త రాజు ప్రాపర్టీస్ చిట్టా

300 Luxury Cars

300 Luxury Cars

300 Luxury Cars : మలేషియా కొత్త రాజుగా 65 ఏళ్ల జోహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ పట్టాభిషక్తులయ్యారు.  కౌలాలంపూర్‌లో దీనికి సంబంధించిన వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈనేపథ్యంలో రాజు సుల్తాన్ ఇబ్రహీం వ్యక్తిగత జీవిత విశేషాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రూ.47వేల కోట్ల ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. మలేషియా రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనే కింగ్.  రాజు సుల్తాన్ ఇబ్రహీం పేరిట బోలెడు మైనింగ్‌ గనులూ ఉన్నాయి.  మలేషియాలో టెలీకమ్యూనికేషన్స్‌ రంగం, పామ్ ఆయిల్ ఇండస్ట్రీని రాజుగారే శాసిస్తున్నారు. దీన్నిబట్టి ఆయన లైఫ్ స్టైల్ ఎంత లగ్జరీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మలేషియా రాజుగారి ఇంట్లో 300 లగ్జరీ కార్లు  ఉన్నాయి. ఈ 300 కార్లలో(300 Luxury Cars) ఒకదాన్ని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఇక ఆయనకు ప్రైవేట్‌ జెట్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో బోయింగ్‌ విమానాలు సైతం ఉన్నాయి. ఆయన కుటుంబానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Manikkam Tagore Vs KTR : మాణిక్కం ఠాగూర్ వర్సెస్ కేటీఆర్.. పరువు నష్టం నోటీసులపై ట్విట్టర్ వార్

బ్రిటన్ రాజు వర్సెస్ రిషి సునక్

బ్రిటన్ దేశ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన భార్య అక్షత మూర్తి పేరు మరోమారు వార్తలకెక్కింది. ఈ ఇద్దరూ మల్టీ మిలియనీర్లే. అయితే, బ్రిటన్ రాజు-2, దివంగత రాణితో పోల్చుకుంటే అక్షత మూర్తి ఆస్తులే అధికంగా ఉన్నాయనే ప్రచారం బ్రిటన్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. బ్రిటన్ రాణి ఆస్తుల విలువ రూ.3400 కోట్లు కాగా, అక్షత మూర్తి ఆస్తుల విలువ రూ.4200 కోట్లుగా ఉన్నాయన్నాట. దీనికి కారణం లేకపోలేదు. అక్షత మూర్తి తండ్రి భారత టెక్ దిగ్గజం కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. బ్రిటన్ పార్లమెంటేరియన్‌లో అత్యంత ధనవంతుడు రిషి సునక్. ఇపుడు ఈ దంపతులిద్దరి ఆస్తులు కలిస్తే మొత్తం విలువ రూ.7 వేల కోట్లకు పైనే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. వీరిద్దరి ఆస్తులు ప్రస్తుత బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే ఎక్కువేనట.