Site icon HashtagU Telugu

Mahesh Babu And Sitara: జీ తెలుగు చానల్ లో మహేశ్ బాబు, సితార సందడి

Sitara Imresizer

Sitara Imresizer

జీ తెలుగు చానల్ లో వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ రియాలిటీ షో కార్యక్రమంపై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వీడియో విడుదల అయింది. ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుమార్తె సితారతో కలసి కార్యక్రమంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఈ కార్యక్రమం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మహేశ్ బాబు ఓ రియాలిటీ షోలో భాగం కావడం ఇదే మొదటిసారి.

ఈ ప్రోమో వీడియోలో సితార సైతం స్టెప్పులు వేయడాన్ని చూడొచ్చు. మహేశ్ బాబు బ్లాక్ టీషర్ట్ లో దర్శనమిస్తే, సితార ఆఫ్ స్కర్ట్ తో కనిపించింది. రెడ్ కార్పెట్ పై తండ్రి, కుమార్తె కలసి వస్తుంటే, కార్యక్రమానికి వీక్షకులుగా వచ్చినవారు, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ చప్పట్లతో స్వాగతం పలకడం కనిపిస్తోంది. కేవలం అతిథులుగా వచ్చారా..? లేక మరేదైనా పాత్ర పోషించనున్నారా? అన్నది తెలుసుకునేందుకు ఆదివారం వరకు ఆగాల్సిందే.