CM Revanth Reddy : మహాంకాళీ బోనాల జాతర..సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు అర్చకులు సచివాలయంలోని మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని కోరారు.

Published By: HashtagU Telugu Desk
Mahankali-Press-Invited-CM-Revanth-Reddy-with-Bonalu

Mahankali-Press-Invited-CM-Revanth-Reddy-with-Bonalu

CM Revanth Reddy: సికింద్రాబాద్‌ మహంకాళీ బోనాల 21న (ఆదివారం) జరుగనున్నాయి..ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు అర్చకులు సచివాలయంలోని మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కును ను సచివాలయంలో ఆయన ఛాంబర్ లో కలిశారు. ఆయనకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి మేయర్ జీ విజయలక్ష్మి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ, వేద పండితులు వేణుమాధవ్ శర్మలు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనార్థం మహంకాళి ఉజ్జయిని దేవాలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Read Also: Dog Bite : హైదరాబాద్ లో 10 ఏళ్లలో కుక్క కాటు కేసులు ఎన్నో తెలుసా..?

 

 

 

 

 

 

 

 

 

  Last Updated: 19 Jul 2024, 05:38 PM IST