జంగిల్ బుక్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మోగ్లీ అనే కుర్రాడు జంతువులతో, పక్షులతో స్నేహం చేస్తాడు. ఇప్పటికీ ఆ పాత్రను పిల్లలు ఇష్టపడతారు. మోగ్లీని ఇమిటేట్ చేసేందుకు వీడియోలు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మోగ్లీలా కనిపించి అందర్నీ షాకు గురిచేశాడు. పిచోరి గ్రామానికి చెందిన 18 ఏళ్ల కన్హయ్య అనే కుర్రాడు టవల్, లోదుస్తులతోనే కాలేజీకి వెళ్లేవాడు. అతను బట్టలు వేసుకోలేదు కానీ టవల్ లో చుట్టుకున్నాడు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యను ఈ విధంగానే పూర్తి చేసి జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం తనను బట్టలు వేసుకోమని ఒత్తిడి చేస్తుందని చెప్పడంతో చదువు ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు అధ్యాపకుల కృషితో ఓ కాలేజీలో అడ్మిషన్ పొంది ఇప్పుడు బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
मध्य प्रदेश का मोगली, कपड़े पहनना नहीं है पसंद, चड्डी-टावेल लपेट जाता है कालेज#MadhyaPradesh #MPNews #Barwani #Naiduniahttps://t.co/nXSsH8SbcM pic.twitter.com/IeDaeqcV9Y
— NaiDunia (@Nai_Dunia) October 19, 2022