Site icon HashtagU Telugu

Madhusudana Chari : మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ధుసూద‌న‌చారి బాధ్యతలు

Madhusudhana Chary Takes charge as Leader of Opposition in Council

Madhusudhana Chary Takes charge as Leader of Opposition in Council

Opposition Leader in Telangana Council :  తెలంగాణ శానమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకి అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Rapaka Varaprasad: జ‌న‌సేన‌లోకి రీఎంట్రీ ఇస్తున్న రాపాక‌.. ముహూర్తం ఫిక్స్‌..?

ఈ సంద‌ర్భంగా శాస‌న‌మండ‌లి తొలి చైర్మ‌న్ స్వామిగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు మ‌ధుసూద‌నాచారికి శుభాంక్ష‌లు తెలిపి, శాలువాల‌తో స‌త్క‌రించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మధుసూదనాచారికి కౌన్సిల్‌లో జరిగిన కార్యక్రమంలో స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: ShakthiSAT : 108 దేశాల బాలికలతో చంద్రయాన్‌-4 శాటిలైట్.. ‘శక్తిశాట్‌’‌కు సన్నాహాలు