Madhavi Latha : హైదరాబాద్‌ లీడ్‌లో మధవీలత

Madhavi Latha: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతుంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌కు భారీ షాక్‌ తప్పదా? మరి ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ […]

Published By: HashtagU Telugu Desk
Madhavi Latha lead in Hyderabad

Madhavi Latha lead in Hyderabad

Madhavi Latha: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతుంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌కు భారీ షాక్‌ తప్పదా? మరి ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా హైదరాబాద్ నియోజకవర్గం నిలిచింది. ఎంఐఎం అభ్యర్థికి మాధవీలత గట్టి పోటీనిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తొలి రౌండ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మాధవీలత ఫలితాల్లో దూసుకు వెళుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ స్థానానికి మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. పూర్తిగా పాతబస్తీ ప్రాంతం కావడంతో ఇక్కడి ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఓటింగ్ 46.08 శాతంగా నమోదైంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండూ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మళ్లీ ఈసారి ఆ రెండూ పార్టీల మధ్యనే ఉత్కంఠ పోరు నెలకొంది.

Read Also: VIP Candidates Tracker: వెనుకంజలో ప్రధాని మోడీ.. రెండుచోట్లా లీడ్‌లో రాహుల్

 

 

  Last Updated: 04 Jun 2024, 09:58 AM IST