Site icon HashtagU Telugu

LSG Mother’s Day Spl: మదర్స్ డే స్పెషల్..లక్నో టీం అదుర్స్…సలాం చేస్తోన్న నెటిజన్లు..!!!

Lsg Mothers Day

Lsg Mothers Day

IPL 2022 53వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో లక్నో తలపడనుంది. ఈ మ్యాచ్ మాహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ముంబైలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లక్నోకు చాలా ప్రత్యేకమైంది. మరో విజయం సాధించినట్లయితే…ప్లే ఆఫ్ రేసులో కేఎల్ రాహుల్ సేన బెర్తును ఖాయం చేసుకోనుంది. ఆ జట్టు 14 పాయింట్లతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు స్పెషల్ జెర్సీతో రానుంది. కారణం ఏంటంటే…మే 8 ఆదివారం మదర్స్ డేను పురస్కరించుకుని టీంలో స్పెషల్ జెర్సీతో రంగంలోకి దిగనుంది.

మే 8న మదర్స్ డేను పురస్కరించుకుని కోల్ కతాపై లక్నో జట్టు ప్రత్యేక జెర్సీని ధరించనుంది. ఆటగాళ్ల తల్లిపేరుతో రాసిన స్పెషల్ జెర్సీలను ధరించనున్నారు. తల్లి అంకితభావంతో పాటు ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు చేప్పేందుకు ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. దీంతో లక్నోజట్టు ప్రత్యేక సెంటిమెంట్ తో తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు లక్నో సూపర్ జెయింటస్ ట్విట్టర్ లోఒక వీడియో పోస్టు చేసింది. సూపర్ జెయింట్ గా మదర్స్ డే కోసం రెడీ అంటూ రాసింది.