Tragedy : విషాదం నింపిన విహార యాత్ర..కళ్లముందే వరదలో కొట్టుకుపోయిన కుటుంబం

సరదాగా గడిపేందుకు డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లగా..ఒక్కసారిగా భారీగా వరదనీరు పోటెత్తడంతో

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 01:20 PM IST

చక్కగా ఫ్యామిలీ తో విహార యాత్రకు వెళ్లిన ఆ ఫ్యామిలీ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. జలపాతంలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా వచ్చిన భారీ వరదకు కొట్టుకుపోయారు. ఈ ఘటన భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

పుణె సయ్యద్ నగర్ లో నివాసం ఉండే ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్ళింది. సరదాగా గడిపేందుకు డ్యామ్ బ్యాక్ వాటర్ (Lonavala Bhushi Dam waterfall )వద్దకు వెళ్లగా..ఒక్కసారిగా భారీగా వరదనీరు పోటెత్తడంతో ఆ కుటుంబం బయటకు రాలేకపోయింది. అంత గట్టిగా వరద నీటిలో నిల్చున్న కానీ వరద ఉదృతి ఎక్కువ అవ్వడం తో వారు నిల్చులేక నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు సైతం వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడలేకపోయారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో నలుగురు చిన్నారులు, మహిళ ఉన్నారు. ఇప్పటికే ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మృతులను సశిష్ట అన్సారీ(36), అనిమా అన్సారీ (13), ఉమెర అన్సారీ (8), అద్నాన్ అన్సారీ (4), మరియా సయ్యద్(9) గుర్తించారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ వీడియో చూసిన వారంతా వర్ష కాలంలో ఎవ్వరు కూడా వాగులు దాటకూడదని, జలపాతాల వద్దకు వెళ్లకూడదని చెపుతున్నారు.

Read Also : Narendra Modi : ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాను