Site icon HashtagU Telugu

Polling : లోక్‌సభ ఎన్నికలు….తొలి రెండు గంటల్లో 10.82 శాతం ఓటింగ్‌

Lok Sabha elections....10.82 percent voting in first two hours

Lok Sabha elections....10.82 percent voting in first two hours

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌(Sixth round of polling) శనివారం కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓట‌ర్లు పెద్ద ఎత్తున త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం 9 గంటలకు వరకు పశ్చిమ బెంగాల్‌తో అత్యధికంగా 16.64 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) 12.33 శాతం, బీహార్‌లో 9.66 శాతం, హర్యానాలో 8.31 శాతం, జమ్మూ కశ్మీర్‌లో 8.89 శాతం, ఝార్ఖండ్‌లో 11.74 శాతం, ఢిల్లీలో 8.94 శాతం, ఒడిశాలో 7.43 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Read Also: Rajinikanth : రజిని కోరిక తీరబోతుందా..? లేక రజినిని మళ్ళీ బాధ పెడతారా..?

కాగా, దేశంలోని ఆరు రాష్ట్రాల, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. ఉదయం పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు.